
మండల సర్వసభ్య సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు అధికారులపై ఆగ్రహం
విజేత,నక్కపల్లి (ప్రత్యేక ప్రతినిధి) ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పనులు మండలంలో పలుచోట్ల అర్ధాంతరంగా నిలచి పోవడం పట్ల ఇంటింటి తాగునీటి సరఫరా పథకం కొండెక్కినట్లు మాజీ వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు
ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎంపీ ఏనుగుపల్లి రత్నo అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో గురువారం జరిగిన మండల సర్వసభ్య ఆఖరి సమావేశంలో మండలంలోని చినదొడ్డిగల్లు సహా పలు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణ తీరు తెన్నుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆ గ్రామంలో విద్యుత్ సక్రమంగా
సరఫరా కావడం లేదని గ్రామస్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నందున మరింత నైపుణ్యం కలిగిన విద్యుత్ లైన్మెన్ ను నియమించాలని మాజీ వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు
సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశానికి హాజరైన
కాగిత ఎంపిటిసి ఆకేటి గోవిందరావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు తరచు గైర్హాజరవుతున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని సభ దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ విభాగం అధికారులు ఏనాడు సభ్యుల సంతృప్తికరంగా మండల సర్వసభ్య సమావేశాలకు హాజరైన పాపాన పోలేదని రస రుసలాడారు. గడచిన రెండేళ్ల కాలంలో రెవెన్యూ అధికారులు ఎవరెవరు ఎన్నిసార్లు మండల పరిషత్ సమావేశాలకు హాజరయ్యారో తెలియజేయాలని సభకు హాజరైన తహాసిల్దార్ బమ్మిడి చిన్ని కృష్ణను నిలదీశారు.ఇందులో పాల్గొన్న
నక్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్)
అధ్యక్షులు కొప్పిశెట్టి బుజ్జి మాట్లాడుతూ మండలంలో
పిఎసిఎస్ ల ద్వారా రైతులు ఇప్పటికే వ్యవసాయ, వ్యవసాయేతర తదితర రుణాలు తీసుకుని ఉన్నoదున మండలంలో ఏపీఐఐసీ చేపడుతున్న భూ సేకరణ
సమయంలో తమకు తెలియజేయకుండా సొసైటీ రైతుల భూములకు పరిహారం చెల్లించడం వలన సొసైటీకి రావలసిన రుణాలు సక్రమంగా వసూలు కావడం లేదన్నారు. ఏపీఐఐసి సొసైటీ రైతుల నుంచి భూసేకరణ కారణంగా సొసైటీ కి రావలసిన సుమారు రూ.70 లక్షల మేర వసూలు కాక బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఇకపై ఏపీఐఐసి చేబట్టే భూసేకరణ సమయంలో రైతులు సంబంధిత పిఎసిఎస్ లకు రుణాలు చెల్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.అలాగే ఉపమాక గ్రామానికి డంపింగ్ యార్డ్ నిమిత్తం 50 సెంట్లు భూమి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఉపమాక గ్రామ కంఠం భూమిని 22ఎ నుండి తొలగించాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు అందరికీ కూడా ఆ పథకం ద్వారా నెలకు 4 వేల రూపాయలు ఇచ్చిందేందుకు వీలుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని పిఎసిఎస్ చైర్ పర్సన్ బుజ్జి కోరారు. వేంపాడు ఎంపీటీసీ కుంచే మధు మాట్లాడుతూ ఆ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో పిల్లల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. దానితోపాటు అంగన్వాడి కేంద్రం పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటం వలన పిల్లలు అనారోగ్యం బారిన పడే వీలునందున ఐసిడిఎస్ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఎంపిటిసి మధు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి గోసల కాసులమ్మ,మాజీ వైస్ ఎంపీపీ -2 వీసం నానాజీ లు మండలంలో గల పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కే.చలపతిరావు, మండల పరిషత్ పరిపాలన అధికారి డి.సీతారామరాజు, తహసిల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు సహా పలు ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.







