
విజేత, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి సుమారు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు హుండీ పగలగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఆలయంలో దొంగతనం యత్నం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పదేపదే చోరీలు జరుగుతుండటంతో ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలని భక్తులు కోరుతున్నారు.



