అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ఉడిపి టిఫిన్ సెంటర్ ధ్వంసం

అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ఉడిపి టిఫిన్ సెంటర్ ధ్వంసం

విజేత, ఇబ్రహీంపట్నం :అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు అకారణంగా తన టిఫిన్ సెంటర్ ను ధ్వంసం చేసినట్లు టిఫిన్ సెంటర్ యజమాని రాజు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మంచల్ రోడ్డు లో శ్రీ ఉడిపి టిఫిన్ సెంటర్ ను అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ధ్వంసం చేశారు. సుమారు లక్ష రూపాయల విలువగల ఆస్తి నష్టం జరిగినట్లు టిఫిన్ సెంటర్ యజమాని నాగ శెట్టి (రాజు) తెలిపారు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిలు, రేకుల షెడ్డు, షాపు బోర్డులు ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారిపై చర్య తీసుకొని న్యాయం తనకు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :