మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది

మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది

నర్మెట్ట సీఐ అబయ్య

డ్రగ్స్,గంజాయి నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ

విజేత, నర్మెట్ట/ జనగామ:

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ, నర్మెట్ట పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, యువకులు, ప్రజలు కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీఐ అబయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ విక్రయాలు, గంజాయి సాగు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా 8712671111 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :