మాదకద్రవ్య రహిత సమాజo కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

మాదకద్రవ్య రహిత సమాజo కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎస్ఐ, కె. మురళి మోహనరావు

విజేత,పాయకరావుపేట : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందున్న ఆధునిక యుగంలో మాదకద్రవ్య రహిత సమాజo కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్థానిక ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎస్ఐ, కె. మురళి మోహనరావు పిలుపునిచ్చారు.ఇక్కడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసు ఆదేశాల మేరకు శనివారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ) కళాశాల విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగం వలన యువత ఏ విధంగా నష్టపోతున్నారో అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ రావు మాదకద్రవ్యం వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికపరంగా కలిగే నష్టాలను వివరించారు. ప్రధానంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబం సహా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.డ్రగ్స్ వినియోగంతో పాటు అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మన చుట్టుపక్కల ఎక్కడైనా మాదకవ్యాలు వినియోగం సహా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే సమాచారాన్ని పాయక రావుపేట ఎక్సైజ్ స్టేషన్ కు అందించినట్లయితే  నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎస్ఐ కె.మురళి మోహనరావు విద్యార్థులతో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ) కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు బాబు,బి.రమణ, కానిస్టేబుల్లు డి. నాగశంక్రరావు,ఆర్. జగన్నాద్,కళాశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :