ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు పెన్షన్ బిక్ష కాదు అది ఉద్యోగి హక్కు అని తీర్పు

ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్

విజేత, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆద్వర్యంలో కొత్త పించన్ విదానాన్ని రద్దు చేసి పాత పించన్ విదానాన్ని అమలు చేయాలని మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేసరు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు పెన్షన్ బిక్ష కాదు అది ఉద్యోగి హక్కు అని తీర్పు ఇవ్వడం జరిగింది సిపిఎస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చే అయకపోవడం బాదాకరమని అన్నారు కొత్త పించన్ విదానాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరింతగా ఉద్యమాలు చేస్తామని అన్నారు.అదే విదంగా జీవో నెంబర్ 25ని సవరించాలని ఇటీవల విద్యాశాఖ ఇచ్చిన బాహ్య మూల్యాంకన విదానపు ఉత్తర్వులను తిరిగి వెనక్కి తీసుకోవాలని PRC ప్రకటించాలని పెండింగ్లో ఉన్న 6 DA లను తక్షణమే విడుదల చేయాలని హెల్త్ కార్డులను అన్ని కార్పోరేట్ హాస్పిటల్లో OP సౌకర్యం మరియు మూడు లక్షల పరిమితిని కాకుండా పది లక్షల వరకు పెంచాలని కాంపిటెంట్ పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలని FLN విజయవంతం చేయడానికి ప్రభుత్వం తగినంత ఉపాధ్యాయులు లేకపోతే విద్యా వాలంటీలను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధానోపాధ్యాయులు మేకల పద్మ కోరెపు శ్రీనివాస్ నాతరి నాగమణి చింతల హరిష్మ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :