మంత్రాలయం 3 ఎంపీటీసీ అభ్యర్థి బి.సులోచనకు మద్దతుగా జనసేన ప్రచారం

గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వాల్మీకి బి.లక్ష్మన్న విజ్ఞప్తి

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆర్.లక్ష్మయ్యకు సైకిల్ గుర్తుకు ఓటు వేయండి

విజేత,మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లో మంత్రాలయం 3 ఎంపీటీసీ అభ్యర్థి బి.సులోచనను జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి.లక్ష్మన్న ప్రచార కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆర్.లక్ష్మయ్యకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓటు అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బివి రవిచంద్ర, బీబీసీ చిన్న (బొజ్జ మోహన్), అంజి, ఉదయ్, గిడ్డయ్య, వన్నూరి, రాఖి, రామకృష్ణ, ప్రవీణ్, ఢిల్లీ, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, దాసు మరియు జనసేన, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 1

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :