చాట్నేహళ్లి గ్రామంలో సైబర్ నేరాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన

గ్రామ పెద్దలకు ఎస్ఐ. ఎస్ . మల్లికార్జున మంత్రాలయం దిశానిర్దేశం

విజేత,మంత్రాలయం/దేవపుత్ర : మంత్రాలయం మండలం చాట్నేహళ్లి గ్రామంలో మంత్రాలయం ఎస్ఐ గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత. ఐ వి ఆర్ ఎస్.కాల్స్, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు వ్యక్తిగత సమాచారం, ఓ టి పి.లు, బ్యాంక్ వివరాలు ఇవ్వవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 కు కాల్ చేయాలని తెలిపారు.అలాగే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (యం సి సి) నిబంధనలు, చేయవలసినవి, చేయకూడనివి (డి వో ఎస్ & డోంట్ ) గురించి వివరించారు. ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా వ్యవహరించాలని గ్రామ పెద్దలకు సూచించారు.

Views: 7

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :