
గాంధీ, శాస్త్రి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్
విజేత, హైదరాబాద్ బ్యూరో: మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ మార్గం, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాటించిన సరళత, దేశభక్తి, నిజాయితీ నేటి తరానికి ఆదర్శప్రాయమని మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ అన్నారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్‌పల్లి హెచ్‌ఏఎల్ పార్క్‌లో నిర్వహించిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం గాంధీ, శాస్త్రి అందించిన సేవలను ఆయన స్మరించుకున్నారు. మహనీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. అనంతరం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు ముద్దం నర్సింహ యాదవ్ సహాయం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.








