పేకాట ఆడుతున్న వారిపై పోలీసుల దాడి

విజేత,చొప్పదండి: చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసరాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగించిన రూ. 4650/- నగదు అలాగే పేకముక్కలను స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ చట్టవిరుద్ధమైన పేకాట,జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.