వేములవాడ బద్ది పోచమ్మ, శీతల దేవి ఆలయాల్లో భక్తుల కిటకిట: ఘనంగా బోనాల మొక్కులు

శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు పూజలు

విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ బద్ది పోచమ్మ, గ్రామ దేవత శీతల దేవి ఆలయాల్లో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది.మంగళవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం, చీర-సారె, బెల్లం సాకలు, పట్నాలు వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ PRO పెరిక శ్రీనివాస్ అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను ఆలయ ఏఈవో నాగుల మహేష్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :