క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో అమాయకులను లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న నిందితులు

ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.30.50 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, పూజా సామాగ్రి స్వాధీనం

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

విజేత, వేములవాడ :

నిందితుల వివరాలు.

A-1: తురుపాటి శ్యాం కుమార్,

తండ్రి: రాంచందర్, వయస్సు: 57 సంవత్సరాలు, కులం: బెడబుడిగెజంగం, నివాసం: మంకమ్మతోట, కరీంనగర్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తూముకుంటలో నివాసం ఉంటున్నారు.

A-2: పత్తెం లక్ష్మీరాజం,

తండ్రి: దుర్గయ్య, వయస్సు: 60 సంవత్సరాలు, కులం: బెడబుడిగెజంగం, నివాసం: అగ్రహారం గ్రామం, వేములవాడ అర్బన్ మండలం.

Cr.No 478/2026, U/s 318(4), 316(2), 308(5) r/w 3(5) BNS, Sec 7 of Drugs and Magic Remedies Act, 1954 of PS Sircilla

నేరం జరిగిన విదానం.  తురుపాటి శ్యాం కుమార్, తండ్రి: రాంచందర్, వయస్సు: 57 సం., కులం: బెడ బుడిగెజంగం, నివాసం: మంకమ్మ తోట, కరీంనగర్ అనునతడు తూముకుంట హైదరాబాద్ లో భద్రకాలి పూజ స్టోర్ నడుపుతూ జీవిస్తున్నాడు. తన వద్దకు చాలా మంది ప్రజలు పూజా సామాగ్రి కొరకు వస్తుంటారు. కాగా తనకు పరిచయస్తుడయిన అగ్రహారం గ్రామం, వేములవాడ కు చెందిన పత్తెం లక్ష్మిరాజమ్, తండ్రి: దుర్గయ్య అను నతడు తన వద్దకు పూజా సామాగ్రి కొరకు వస్తుండేవాడు. వారిద్దరూ కలసినప్పుడు, లక్ష్మిరాజమ్ అగ్రహారం మరియు చుట్టూ ప్రక్కల గ్రామాలలో క్షుద్ర పూజలు చేస్తానని, తన యొక్క పూజలను మరియు మూడ నమ్మకాలను నమ్మే అమాయక ప్రజలు, పూజల కొరకు తన వద్దకు వస్తారని, మంత్రాలు, తంత్రాలు, దిష్టి తీసివేయుట మరియు చేతబడుల పేరుతో పసుపు, కుంకుమ మరియు వివిధ రకాలయిన పూజా సామాగ్రితో వారిని నమ్మించే విధంగా పూజలు చేయుచూ, వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటానని, మరియు తెలిసినవారు ఎవరయినా పూజలు కావాలని వస్తే, తాను చాలా పెద్ద పూజారిని అని, వివిధ సమస్యల గురించి, దీర్గ కాలిక వ్యాదుల నయం గురించి క్షుద్ర పూజలు చేస్తానని వారిని నమ్మించి, తన వద్దకు పంపిస్తే, పూజల పేరుతో వారి వద్ద నుండి పెద్ద మొత్తం లో డబ్బులు వసూలు చేయవచ్చునని, తరువాతా ఇద్దరం సమానంగా పంచుకుందాం అని శ్యాం కుమార్ తో చెప్పగా, శ్యాం కుమార్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. కాగా ఈ సంవత్సరంలోని జనవరి నెలలో, శ్యాం కుమార్ కు పరిచయస్తురాలయిన ఉప్పల్, హైదరాబాద్ కు చెందిన బండారి లత, భర్త: రాజ్ కుమార్ అనునామే పూజా సామాగ్రి కొరకు శ్యాం కుమార్ యొక్క షాపు వద్దకు వచ్చి శ్యాం కుమార్ తో మాట్లాడుతూ, తాను గత కొంత కాలంగా తీవ్ర మయిన అనారోగ్యంతో బాధ పడుతున్నానని, ఎన్ని ఆసుపత్రులల్లో చూపించుకున్నా కూడా నయం కావడం లేదని, శ్యాం కుమార్ తో చెప్పగా. ఆమెకు దేవుళ్ళు మరియు పూజలపయిన చాలా నమ్మకం ఉండడంతో, క్షుద్ర పూజలతో ఆమె అనారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మించి ఆమె వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చునని బావించి, శ్యాం కుమార్ ఆమెతో మాట్లాడుతూ, క్షుద్ర పూజల ద్వారా తన యొక్క దీర్గ కాలిక వ్యాదులు పూర్తిగా నయం అవుతాయని, జీవితాంతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తన పేరు పైన పూజలు చేపిస్తానని, శ్యాం కుమార్ కు క్షుద్ర పూజలు మరియు మంత్రాలు చేసే అగ్రహారం గ్రామం, వేములవాడ కు చెందిన పత్తెం లక్ష్మిరాజమ్ అనునతడు చాలా పరిచయం అని, అతడు చాలా మందికి నయం చేసాడని ఆమెను నమ్మించే విదంగా మాట్లాడగా, ఆమె శ్యాం కుమార్ యొక్క మాటలను నమ్మి లక్ష్మిరాజమ్ వద్దకు వెళ్లి కలుద్దాం అని చెప్పగా, శ్యాం కుమార్ ఆమెను ఫిబ్రవరి నెలలో సిరిసిల్ల పట్టణంలోని పాత బస్సు స్టాప్ వద్దకు తీసుకు వచ్చి లక్ష్మిరాజమ్ కు కల్పించగా, వారు వేసుకున్న పథకం ప్రకారం లక్ష్మిరాజమ్ ఆమెను తన యొక్క మాటలతో నమ్మించి, తన అనారోగ్యాన్ని నయం చేస్తామని చెప్పి, పూజల కొరకు డబ్బులు ఖర్చు అవుతాయని పూజా సామాగ్రి కొరకు 10 లక్షల రూపాయలు కావాలని చెప్పగా, ఆమె అదే రోజు 10 లక్షల రూపాయల నగదును లక్ష్మిరాజం కు ఇచ్చినది, తరువాత ఆమెను పూజల పేరుతో వివిధ స్తలాలలో తిప్పుతూ, ఇంకా పూజల కొరకు డబ్బులు కావాలని ఆమెను అడగగా, ఆమె యాదగిరి గుట్ట వద్ద 21 లక్షల రూపాయల నగదును మరియు కాశీ లో 13 లక్షల రూపాయల నగదుని లక్ష్మిరాజం కు ఇచ్చినది, తరువాత శ్యాం కుమార్ ఇచ్చిన SBI బ్యాంకు అకౌంటు 41666383218 కు మరియు ఇతర బ్యాంకు అకౌంటు లకు విడతల వారీగా వారిద్దరూ చెప్పిన విధంగా అందాజా 62 లక్షల రూపాయల వరకు పంపినారు మరియు మిగతా కొంత డబ్బులను ఆమె చేత ఖర్చు పెట్టిన్చినారు. తరువాత ఆమె వారిద్దరి యొక్క మోసాన్ని తెలుసుకుని వారిని నిలదీస్తుందనే బయంతో భవిష్యత్తులో ఆమెను బ్లాకు మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెతో తెల్ల కాగితాలపైన సంతకాలు పెట్టించుకున్నారు.

తరువాత ఆమె కొద్ది నెలలుగా వారి వద్దకు వస్తూ తనకు అనారోగ్యం నయం కాలేదని వారిని అడిగి, తన యొక్క డబ్బులను వాపసు ఇవ్వమని అడగగా, వారిద్దరూ కల్సి ఆమెను బెదిరించి, క్షుద్ర పూజల తో చేతబడి చేసి ఆమెను మరియు ఆమె యొక్క కుటుంబం మొత్తాన్ని చంపివేస్తామని ఆమెను బెదిరించినారు, తరువాత ఆమె ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా ఆమె యొక్క పంట పొలంలో పెద్ద మొత్తంలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని వెలికి తీసి ఇస్తామని ఆమెతో చెప్తూ నమ్మిన్చినారు. తిరిగి ఈ నెలలో 23 వ తీదీన ఆమె యొక్క డబ్బులను తిరిగి ఇస్తామని, సిరిసిల్ల పాత బస్సు స్టాప్ వద్దకు రమ్మని ఆమెతో అబద్దం చెప్పగా ఆమె అదే రోజు అక్కడకు వచ్చింది. కానీ వారు వెళ్ళలేదు.తదుపరి ఆమె వారిద్దరి పైన పొలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పొలిసు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంబించి, వారిద్దరని అగ్రహారం లోని లక్ష్మిరాజమ్ ఇంటి వద్ద అదుపులోనికి తీసుకుని, వారివద్దనుండి 30,50,000/- రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్ లను, క్షుద్ర పూజలు చేయుటకు వాడే రెండు బెల్లం తో తయారు చేసిన బొమ్మలను మరియు పసుపు, కుంకుమ లను స్వాదీన పరచుకుని రిమాండ్ తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :