Logo
Date of Publish : 24 June 2026, 11:32 am
Editor : B. Anil Kumar

ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడాలి

*ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడాలి*

*ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు ప్రత్యేక శిక్షణ*

*ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి*

విజేత,రాజేంద్రనగర్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచించారు.మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిపోవడం, వివరాల్లో పొరపాట్లు చోటుచేసుకోవడం వంటి సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చిరునామా మార్పులు, వివరాల సవరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఎల్‌ఏలకు సూచించారు.అనంతరం ఎస్‌ఐఆర్ విధివిధానాలు, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటర్ల నమోదు ప్రక్రియపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. విజయ డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఎల్‌ఏలకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ సందేహాలను నివృత్తి చేశారు.ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు వెన్నెముక వంటిదని అన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా, ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో ఖచ్చితత్వంతో ఉండేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )