Logo
Date of Publish : 24 June 2026, 11:55 am
Editor : B. Anil Kumar

ఉపసర్పంచ్‌ల ఐక్యతే లక్ష్యం మండల ఫోరం అధ్యక్షుడిగా చిలివేరు మహేందర్… జిల్లా కార్యదర్శిగా నాగపురి కిషన్ గౌడ్ ఎన్నిక

ఉపసర్పంచ్‌ల ఐక్యతే లక్ష్యం

మండల ఫోరం అధ్యక్షుడిగా చిలివేరు మహేందర్... జిల్లా కార్యదర్శిగా నాగపురి కిషన్ గౌడ్ ఎన్నిక

విజేత,తరిగొప్పుల : 

గ్రామ పంచాయతీల బలోపేతం, ఉపసర్పంచ్‌ల హక్కుల సాధన కోసం తరిగొప్పుల మండల ఉపసర్పంచ్‌లు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. జనగామ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని స్థానిక రాజరాజేశ్వరి ఫంక్షన్ హల్ తరిగొప్పుల లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా చిలివేరు మహేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో సమావేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అదే సందర్భంగా జనగామ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా కార్యదర్శిగా నాగపురి కిషన్ గౌడ్‌ను ఎంపిక చేశారు.ఫోరం ఉపాధ్యక్షులుగా మూడవత్ రాజు, ఎర్ర మహేష్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల సురేష్, కార్యదర్శిగా భూఖ్య రవి, కోశాధికారిగా నీల సంపత్, సలహాదారుడిగా బి. రెడ్డి పాపిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పెనుమల్ల రవి, సుంకరి కరుణాకర్, భుక్య మాన్సింగ్, బెజ్జం భవాని తదితరులను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలివేరు మహేందర్ మాట్లాడుతూ మండలంలోని ఉపసర్పంచ్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ఉపసర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌లకు ప్రభుత్వ పరంగా రావలసిన గుర్తింపు, అధికారాల కోసం ఫోరం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఫోరం పోరాటం చేస్తోందని తెలిపారు. "హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ఉపసర్పంచ్‌ల సంక్షేమం కోసం ఫోరం తరఫున నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మండలంలోని ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ఫోరం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )