Logo
Date of Publish : 23 October 2026, 4:19 pm
Editor : B. Anil Kumar

సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేసిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

విజేత,వికారాబాద్ ప్రతినిధి : సబ్సిడీపై శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. వికారాబాద్ మండలం లోని నారాయణపూర్ రైతువేదికలో రైతులకు శనగ విత్తనాలను వైస్ చైర్మన్ మల్లేశంతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,నాణ్యమైన విత్తనాలను సరైన సమయంలో వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పంట దిగుబడులు సాధించొచ్చని తెలిపారు.రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి పేర్కొన్నారు. సబ్సిడీపై శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 25 కిలోల బ్యాగు ధర రూ.2,500 కాగా ప్రభుత్వ రూ.1,000 సబ్సిడీ పోను రైతులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్ జిరాక్స్ ఏ ఈ ఓ ను సంప్రదించి నారాయణపూర్ రైతువేదిక కేంద్రంలో విత్తనాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగారెడ్డి, ఏ ఈ ఓ రమాదేవి,రైతులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 41