Logo
Date of Publish : 27 September 2026, 9:56 am
Editor : B. Anil Kumar

శేరిగూడలో కోలాహలంగా వినాయక నిమజ్జన వేడుకలు

- గాయని మధుప్రియ పాటలతో మార్మోగిన గ్రామం.

- లక్షకు లడ్డూను కైవసం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత తాళ్ల శ్రీశైలం గౌడ్.

- భక్తులకు అన్నప్రసాద వితరణ.

విజేత, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడలో 11 రోజుల పాటు ఘనంగా జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు శనివారం రాత్రి కన్నుల పండువగా ముగిశాయి. కంట మహేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని నిమజ్జన మహోత్సవాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్ల శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై భక్తుల్లో ఉత్సాహం నింపారు. నిమజ్జన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రముఖ జానపద గాయని మధుప్రియ. ఆమె తన అద్భుతమైన గాత్రంతో భక్తి, జానపద పాటలు ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మధుప్రియ పాటలకు యువత, చిన్నారులు, మహిళలు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ గణపతి నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు.

*వరుసగా రెండోసారి లడ్డూ కైవసం*

ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంలో కాంగ్రెస్ నేత తాళ్ల శ్రీశైలం గౌడ్ పోటీపడి రూ.1,00,000/- (లక్ష రూపాయలు) కు లడ్డూను కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం కూడా లక్ష రూపాయలకే లడ్డూను దక్కించుకుని భక్తిని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాళ్ల శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ... "విఘ్నాలను తొలగించే వినాయకుని దీవెనలతో శేరిగూడ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను గత సంవత్సరం నుండి నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తున్నాను. ఇది కేవలం ఎన్నికల కోసం చేసే సేవ కాదు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో తలెత్తే ప్రతి సమస్యను ముందుండి పరిష్కరించడమే నా లక్ష్యం. 11 రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా ఉత్సవాలను విజయవంతం చేసిన యూత్ సభ్యులకు, భక్తులకు, పోలీసు శాఖకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వందలాది మంది భక్తులకు తాళ్ల శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కంట మహేశ్వర యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )