Logo
Date of Publish : 26 September 2026, 10:54 am
Editor : B. Anil Kumar

రహదారుల నిర్మాణానికి నిధుల మంజూరు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి

శాసనసభాపతికి ధన్యవాదాలు తెలిపిన డిసిసి మెంబర్ సిహెచ్ కొండయ్య

విజేత,వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని డిసిసి మెంబర్ సిహెచ్ కొండయ్య అన్నారు. శనివారం డిసిసి మెంబర్ సిహెచ్ కొండయ్య విజేత ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలని అన్నారు. రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ధారూర్ మండలంలో రహదారుల నిర్మాణానికి 8.40 కోట్లు మంజూరు కావడంపై డిసిసి మెంబర్ సిహెచ్ కొండయ హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ భారీగా నిధులు మంజూరు చేసి ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పిడబ్ల్యుడి రోడ్లు నుంచి జెడ్పి రోడ్లు పిసిఎం తండా రోడ్డుకు 3.50 కోట్లు, ధర్మాపూర్-ధారూర్ కుక్కింద,కొండాపూర్ రోడ్డుకు 1.60 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్డు రాంపూర్ తండా రోడ్డుకు 75 లక్షల రూపాయలు, జెడ్పి రోడ్డు నుంచి నాగసాన్ పల్లి రోడ్డుకు 55 లక్షలు, పిడబ్ల్యు రోడ్డు దోర్నాల తండా రోడ్డుకు 50 లక్షలు, నాగసమందర్ అల్లాపూర్ రోడ్డుకు 1.50 కోట్లు మంజూరు చేసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు దారుర్ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, స్పీకర్ సహకారంతో మరిన్ని నిధులు మంజూరు తెచ్చి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )