*భద్రపద పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర ఆలయంలో భక్తుల భజన కీర్తనలు
విజేత,రంగారెడ్డి :
షాద్నగర్ నియోజకవర్గంలో, ఫరూక్ నగర్ మండలం,రామేశ్వరం గ్రామం, రామలింగేశ్వర ఆలయం లో,భాద్రపద పౌర్ణమి సందర్భంగా,కిచకిచలాడిన భక్తులు ఆటపాటలతో భజనలతో శివనామస్మరణతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాగరణలు ఉపవాసం భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.
కాపాడు శివయ్య అని తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు అని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ముద్దెంగూడ,భజన మండలి,కూర రామచంద్రయ్య, భూపతి సురేష్,కూర సత్యనారాయణ,రావులపల్లి అంజయ్య, కూరశేకరయ్య,ననాజిపురం హనుమంతు,కొత్త కురువ రాములు, మాల నరసింహులు,జిట్టె శ్రీనివాస్ ముదిరాజ్, నారమోని మల్లయ్య,సైదుపల్లి నర్సింహులు,మరియు వివిధ గ్రామాల భజన భక్తులు,వివిధ గ్రామాల ప్రజలు,పౌర్ణమి రోజు జాగరణ నిర్వహించారు.
