శ్రీచెన్నకేశవనాథ త్రికుటాలయం శిల్పకళావైభవానికి ప్రతీక.
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో అదనపుకలెక్టర్ రాజాగౌడ్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ లు ఉద్ఘాటించారు.
విజేత,రాయికల్: కాకతీయ కాలంనాటి శ్రీచెన్నకేశవనాథ త్రికుటాలయం తెలంగాణ ఆధ్యాత్మిక,చారిత్రక సంస్కృతిక,శిల్పకళా వైభవానికి ప్రతీక యని జగిత్యాల జిల్లాఅదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, జగిత్యాల శాసనసభ్యులు డా: ఎం.సంజయ్ కుమార్ లు సంయుక్తంగా తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా రాయికల్ పట్టణం లోని శ్రీ చెన్నకేశవనాథ త్రికుటాలయం రాయికల్ లో జగిత్యాల పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాయికల్ మున్సిపల్ పర్యవేక్షణలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా:ఎం.సంజయ్ కుమార్, జగిత్యాలజిల్లా అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్ లు ముందుగా ఆలయంలోని శ్రీ పంచముఖలింగేశ్వర, శ్రీలక్ష్మీవెంకటేశ్వర,సూర్యనారాయణ స్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మంటపంలో ఏర్పాటు చేసిన పర్యాటకదినోత్సవ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్ లు జ్యోతిప్రజ్వలన చేసి, తర్వాత సభాసమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవనాథ ఆలయం శాలివాహన శకం 11వ శతాబ్దం చాళుక్యుల కాలంలో ప్రారంభమైన ఈ ఆలయం 1304వ సంవత్సరం కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడి కాలంలో ఈ శ్రీ చెన్నకేశవనాథ ఆలయం అభివృద్ధి చెందినదని చారిత్రక వివరాలు పేర్కొంటున్నాయన్నారు.ఈ త్రికుటాలయం తెలంగాణ చారిత్రక,సంస్కృతిక,శిల్పకళా వైభవానికి ప్రతీక. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రక ప్రాధాన్యతను మరింత వెలుగులోకి తీసుకువచ్చి ఆలయ పరిసరాలు అభివృద్ధి చేసి రాబోయే తరాలకు ఈ అపూర్వ వారసత్వ సంపదను భద్రపరిచి అందిద్దాం అన్నారు. ఈ శ్రీచెన్నకేశవనాథ ఆలయ చారిత్రక సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని,ఈ త్రికుటాలయానికి రాయికల్ పట్టణప్రజల అవసరాల నిమిత్తం నిధులు కేటాయించి కార్యక్రమాల కొరకు మంటపాన్ని ఏర్పాటు చేశామన్నారు. పర్యాటక, పురావస్తు శాఖల సహకారంతో అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి ఆలయానికిఅనుగుణంగా ప్రణాళికలు తయారుచేసి చేసి గుడికోట త్రికుటాఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీ చెన్నకేశవనాథఆలయ అభివృద్ధికి ఆలయకమిటీ అందజేసిన వినతిపత్రం కు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచంలో కొన్నిదేశాలు పర్యాటక రంగంపై ఆధారపడి అభివృద్ధి సాధిస్తున్నాయి. రైసింగ్ తెలంగాణ 2047వ సం:లో భాగంగా 50 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పురాతన కట్టడాలు కాపాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అనంతరం జగిత్యాల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ మాట్లాడుతూ రాయికల్ శ్రీ చెన్నకేశవనాథ త్రికూట ఆలయం లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. శ్రీ చెన్నకేశనాథ త్రికూటఆలయం ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రాచీనసంస్కృతిక,శిల్పకళకు నిదర్శనం. ఈ ఆలయ అభివృద్ధికి జగిత్యాలజిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అనుమతి తో పర్యాటక, పురావస్తు శాఖలతో ఆలయానికి అనుగుణంగా ప్రణాళికలు తయారుచేసి అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు రాయికల్ శ్రీ చెన్నకేశవనాథ ఆలయంలో నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని తెలుపుతూ, వర్షంపడితే ఆలయ విగ్రహాల పై నీరుపడుతుందని మరియు ఆలయానికి ప్రహరీగోడ అవసరముందని వాటికి నిధులు కేటాయించి శ్రీ చెన్నకేశవనాథ త్రికూట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కోరారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొని తెలంగాణ గేయ బృందా నాట్యాలను ప్రదర్శించి పలువురుని ఆకట్టుకున్నారు.

జగిత్యాల జిల్లాలో ప్రపంచ పర్యాటకదినోత్సవ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలలో క్రీడాపోటీలు, వ్యాసరచనపోటీలు నిర్వహించి, ఉత్తమప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలతో మెడల్స్ తో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల తహసిల్దార్ ఎస్.నాగార్జున ,ఆత్మ చైర్మన్ కాట్పల్లిగంగారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ సౌజన్యశ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ టి.మనోహర్ గౌడ్ ఫ్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి మున్సిపల్ మాజీచైర్మన్ హనుమాన్లు జగిత్యాలజిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము, డి.వై.ఎస్.ఓ.రవి, వివిధశాఖల అధికారులు,స్థానిక కౌన్సిలర్లు, మండల నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు వివిధ మండలాలపాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
