Logo
Date of Publish : 17 July 2026, 10:46 pm
Editor : B. Anil Kumar

అభివృద్ధి కోసం నిధులిస్తే… జీతాలకు, కరెంట్ బిల్లులకు మళ్లిస్తారా?

ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు...

• ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి...

• లేనిపక్షంలో కేంద్ర నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లలోనే జమ చేసే అంశాన్ని పరిశీలిస్తాం...

• గడువులోగా అమృత్ పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు...

• కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది...

• కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...

 

విజేత,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో కేంద్రానికి లేఖ రాసి, అవసరమైతే ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే, ఇతర ఉన్నతాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, స్థానిక నాయకులతో కలిసి అమృత్–2 పథకం కింద రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం కార్గిల్ యుద్ధ స్మారక శకటాన్ని సందర్శించి వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, అమృత్–2 పథకం ద్వారా కార్గిల్ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటామని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించినట్లు చెప్పారు. ఆలస్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద పట్టణాల్లో తాగునీరు, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. తెలంగాణకు అమృత్–1 కింద రూ.1,660 కోట్లు, అమృత్–2 కింద రూ.3,429 కోట్లు మంజూరు చేశామని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ.400 కోట్ల నిధులు కేటాయించగా, అందులో సిరిసిల్ల మున్సిపాలిటీకే రూ.105.57 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు తగిన నిధులు విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం చట్టవిరుద్ధమని, సర్పంచులపై ఒత్తిడి తీసుకువచ్చి అలా చేయించడం సరికాదని బండి సంజయ్ అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుని కేంద్రం కేటాయించిన నిధులను ఆయా లక్ష్యాలకే వినియోగించాలని, లేకుంటే కేంద్రం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )