Logo
Date of Publish : 24 October 2026, 12:48 pm
Editor : B. Anil Kumar

రూ. 18.5 కోట్ల ప్రజాధనం ” వృధా”.. కొత్త భవనం ఉన్నా ఇరుకు గదుల్లోనే నార్సింగి ఆఫీస్

సకల సౌకర్యాలతో మున్సిపల్ భవనం సిద్ధంగా ఉన్నా పట్టించుకోని అధికారులు

పార్కింగ్, మరుగుదొడ్లు లేక నార్సింగి సర్కిల్-45 ఆఫీస్‌లో ప్రజల అవస్థలు

వెంటనే నూతన భవనంలోకి మార్చాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సీతారాం ధూళిపాళ డిమాండ్

విజేత,రాజేంద్రనగర్ : కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తే.. దానిని మూలన పడేసి, ప్రజలను ఇరుకు గదుల్లో ఇబ్బందులకు గురిచేయడం ఏ రకమైన పాలన అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సీతారాం ధూళిపాళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణికొండలో ఏకంగా రూ. 18.5 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని పూర్తిస్థాయిలో వినియోగలోకి తేకపోవడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం నీళ్లపాలవుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం నడుస్తున్న నార్సింగి సర్కిల్‌–45 కార్యాలయంలో తీవ్ర స్థలాభావం ఉండటంతో పాటు, కనీస పార్కింగ్ సౌకర్యం లేక, మరుగుదొడ్ల కొరతతో రోజువారీ పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు.సకల వసతులతో కొత్త భవనం కళ్లముందే సిద్ధంగా ఉన్నా, ప్రజలను పాత ఆఫీసులోనే నరకయాతన పెడుతుండటం అధికారుల పట్ల ఉన్న బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందన్నారు. సేవలను వేగవంతం చేసి, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే నార్సింగి సర్కిల్-45 కార్యాలయాన్ని వెంటనే మణికొండలోని నూతన భవనంలోకి తరలించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, భవనం వినియోగంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గుట్టమిది నరేందర్‌, సాయి రెడ్డి, అందే లక్ష్మణరావు, సుమనలిని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 41