Logo
Date of Publish : 03 September 2026, 5:13 pm
Editor : B. Anil Kumar

1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

విజేత ఎల్లారెడ్డిపేట:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు వరస కృష్ణహరి, సర్పంచులు ఎలగందుల నరసింహులు, అందె సుభాష్, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి , ఉప సర్పంచ్ బంధారపు బాల్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సందీప్, ఆకుల మురళి మోహన్ గౌడ్ , హసన్ భాయ్, దూస శ్రీనివాస్,మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, జబ్బర్,లింగాల సందీప్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )