Logo
Date of Publish : 03 July 2026, 8:44 am
Editor : B. Anil Kumar

హోటల్ తిండ్లపై ‘ఫుడ్ సేఫ్టీ’ నిఘా

నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్.. అత్తాపూర్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సౌమ్య హెచ్చరిక

విజేత,రాజేంద్రనగర్ :

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకునేది లేదని అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సౌమ్య స్పష్టం చేశారు. గురువారం సర్కిల్ పరిధిలోని పలు రెస్టారెంట్లలో ఆమె సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిచెన్ రూమ్‌లు, ఆహార నాణ్యతను పరిశీలించి, యాజమాన్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రజారోగ్యమే మాకు ముఖ్యం. ప్రతి హోటల్, రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నూటికి నూరు శాతం పాటించాల్సిందే. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్, కిచెన్ పరిశుభ్రత, వంటల్లో వాడే ముడి సరుకులు, నీటి నాణ్యతతో పాటు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక నిఘా పెట్టాం" అని వెల్లడించారు. నిబంధనలు తుంగలో తొక్కి, కలుషిత ఆహారాన్ని విక్రయిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, నోటీసులతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని... అవసరమైతే హోటళ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. హోటళ్లలో అక్రమాలు గమనిస్తే వినియోగదారులు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )