Logo
Date of Publish : 04 September 2026, 1:28 pm
Editor : B. Anil Kumar

హరిదాస్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణి

పాల్గొన్న గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు

విజేత,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామములో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్, ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యములో లబ్దిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన తిప్పరవేణి భాగ్య, రొడ్డ సరవ్వ, గద్దల భూమరాజవ్వ, వట్టెల లక్ష్మి, జక్కుల రాణి లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయబడతాయని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయవలసిందిగా తెలిపారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్కా పర్శరాముల, కాంగ్రెస్ నాయకులు వంగ మల్లారెడ్డి, రొడ్డ రామచంద్రం, ఉత్తెర్ల లక్ష్మణ్, వట్టెల రాములు, వట్టెల రవి, చీకట్ల నారాయణ, జక్కుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )