Logo
Date of Publish : 03 September 2026, 11:48 am
Editor : B. Anil Kumar

సూర్యాపేటలో ఏసీబీ దాడులు… టీపీఓ ఇంట్లో కీలక పత్రాలు పరిశీలన,

ఏసీబీ వలలో సూర్యాపేట కోదాడ ఇంచార్జ్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య.

మానస నగర్ లోని ఇంట్లో దాడులు చేస్తున్న ఏసీబీ అధికారులు,

విజేత, సూర్యాపేట:  సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎస్సీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, పీటీఓ,సోమయ్య, ఇంట్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు గురువారం ఉదయం. తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. అధికారులు ఇంట్లో పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నగదు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులు,నిర్మాణ ప్రణాళికలు, నిబంధనల అమలు తదితర అంశాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో టీపీఓ నివాసంలో ఏసీబీ సోదాలు జరగడం సూర్యాపేట మున్సిపాలిటీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. సోదాలో ఆదాయానికి మించిన ఆస్తులు, నగదు లేదా ఇతర అనుమానస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా బయటపడ్డాయా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏసీబీ అధికారులు తనిఖీలు పూర్తి చేసిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు,పత్రాలు, ఆస్తుల వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )