విజేత,కృష్ణ : మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీలో సమస్యలు పరిష్కరించాలని మాగనూరు కాలనీ వాసులు సోమవారం రోజు ఎంపీడీవో ఆఫీసులో ప్రజావాణి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1988లో 200 పైచిలుకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అప్పటినుంచి ఇప్పటివరకు కాలనీలో ఏలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వర్షాకాలం వచ్చిందంటే విషపురుగులు పాములు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది పాము కాటుకు గురై మహిళ మరణించడం జరిగింది గుంతలు ఏర్పడి రోడ్డు కాలిబాటతో నడవలేని పరిస్థితి ఉంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయట తిరిగే పరిస్థితి కూడా లేదు పిచ్చి మొక్కలు పెరిగి చెత్తచెదారంతో ఎక్కడి నీళ్లు అక్కడ ఆగి బురద మయంగా మారింది కావున కాలనీ సమస్యలు దృష్టిలో ఉంచుకొని వెంటనే సిసి రోడ్లు, డ్రైనేజీలు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఎం పి ఓ కళ్యాణి గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంజనూర్ ఆంజనేయులు, పాటి మీది వెంకటయ్య ,ట ప్ప రమేష్, లంగటి శేఖర్, పుంజనూర్ మహదేవ్, ఆంజనేయులు ,మారెప్ప రాజు, వాబయ్య , తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.