గుడెబల్లూరులో అంగరంగ వైభవంగా ఊరేగింపు
విజేత,కృష్ణ : కృష్ణ మండలకేంద్రంలో గుడెబల్లూరు గ్రామంలో శ్రావణ మాసం నాల్గవ శనివారం పురస్కరించుకుని భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి గ్రామ ఇలవేల్పు అయిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని* భక్తులు, గ్రామ పెద్దలు కలిసి కృష్ణా నది వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా జలాభిషేకం చేయించారు. అనంతరం స్వామివారిని పల్లకీపై ఉంచి మేళతాళాలు, డోలు వాయిద్యాలు, భజనల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు భక్తులు చేతుల్లో కలశాలతో, స్వామి వారి తలపై గొడుగులు పడుతూ స్వామివారికి ముందు నడువగా, వెనుక వందలాది మంది భక్తులు "గోవిందా గోవిందా నినాదాలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు యువకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.