Logo
Date of Publish : 16 October 2026, 11:49 am
Editor : B. Anil Kumar

శ్రీ సరస్వతీదేవి అలంకారంలో ఏడుపాయల వనదుర్గాదేవి

వైభవంగా కొనసాగుతున్న దేవినవరాత్రుల ఉత్సవాలు

విజేత,పాపన్నపేట : శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ మాత పుణ్యక్షేత్రం లో దేవీశరన్నవ రాత్రుల మహోత్సవాలు వైభవోపేతంగా అంగరంగవైభవంగా దుర్గానామస్మరణలతో భక్తితన్మయంతో మారుమ్రోగుతున్నాయి. దేవీశరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం ఉత్సవ మండపంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారు అలంకారంలో పట్టువస్త్రంలో వన దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అత్యంత అద్భుతంగా ముస్తాబైన వన దుర్గాభవాని అమ్మ వారికి, గోకుల్ షెడ్ లోని ఉత్సవ మండపంలో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితులు,ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు.

ఉత్సవ మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త్తులు అమ్మవారికి కుంకుమార్చన, విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ను స్వీకరించారు. ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )