Logo
Date of Publish : 12 October 2026, 4:06 pm
Editor : B. Anil Kumar

శ్రీ గాయత్రీదేవి-బ్రహ్మచారిని అలంకారంలో ఏడుపాయల వనదుర్గాదేవి కుంకుమార్చన- విశేష పూజలు

విజేత,పాపన్నపేట : శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రం లో దేవీశరన్నవ రాత్రుల మహోత్సవాలు వైభవోపేతంగా, దుర్గానామస్మరణలతో మారుమ్రోగుతూ భక్తితన్మయంతో పులకించిపోతుంది. దేవీశరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండవరోజైన సోమవారం ఉత్సవ మండపంలో గాయత్రీదేవి-బ్రహ్మచారిని అమ్మవారు అలంకారంలో పట్టువస్త్రంలో వనదుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.

సోమవారం ఉదయం గర్భాలయంలోని వన దుర్గాదేవి అమ్మవారికి, గోకుల్ షెడ్ లోని ఉత్సవ మండపంలో శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితులు,అర్చకుల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు.ఆలయం తరపున ప్రధాన అర్చకులు శంకర్ శర్మ పట్టువస్త్రాలను సమర్పించగా, అర్చకులు శంకర్ శర్మ, పార్థీవ శర్మ,రాజేశ్వర్ శర్మ, మురళీధర్ శర్మ లు దేవీ వవరాత్రుల ప్రత్యేక పూజలు, అమ్మవారికి కుంకుమార్చన విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. గర్భాలయంలో దుర్గాదేవి అమ్మవారికి అర్చకులు పార్టీవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ను స్వీకరించారు.

ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మహిళలు పెద్దఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్,మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, తదితర సిబ్బంది చర్యలు తీసుకున్నారు. భక్తులకు వనదుర్గ అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )