కన్నులపండువగా జరుగుతున్న ఉత్సవాలు
విజేత,పాపన్నపేట : శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రం లో దేవీశరన్నవ రాత్రుల మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వైభవోపేతంగా దుర్గానామస్మరణలతో ఏడుపాయల క్షేత్రం మారుమ్రోగుతుంది.
[video width="832" height="464" mp4="https://aksharavijetha.com/wp-content/uploads/2026/10/VID-20261013-WA0008.mp4"][/video]
దేవీశరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా మూఢవరోజైన మంగళవారం ఉత్సవ మండపంలో శ్రీ అన్నపూర్ణ- చంద్రఘంటదేవీ అమ్మవారు అలంకారంలో పట్టువస్త్రంలో వన దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధాన గర్భాలయంలోని వన దుర్గాదేవి అమ్మవారికి, గోకుల్ షెడ్ లోని ఉత్సవ మండపంలో శ్రీ అన్నపూర్ణ చంద్రఘంటదేవీ అలంకారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితులు,అర్చకులు శంకర్ శర్మ, పార్టీవశర్మ, మురళీధర్ చారీ, రాజేశ్వర్ శర్మ ల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల్లో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ళ మల్లిఖార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు బెజుగం ఉప్పల శంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.మహిళలు, భక్తులు పెద్దఎత్తున అమ్మవారికి కుంకుమార్చన, విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. ప్రధాన గర్భాలయంలో శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో ఉన్న వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ను స్వీకరించారు. ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ వీరేశం ఆధ్వర్యంలో సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తదితర సిబ్బంది చర్యలు తీసుకున్నారు. భక్తులకు వనదుర్గ అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు.
