Logo
Date of Publish : 18 September 2026, 1:56 pm
Editor : B. Anil Kumar

శేరిగూడలో కొత్త ఫీచర్స్ తో నెక్సా మారుతి బెలినో నూతన మోడల్ కారు లాంచ్

- టెస్ట్ డ్రైవ్ చేసి ప్రారంభించిన ఏసిపి కెపివి రాజు

విజేత, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో ఉన్న ప్రైవేట్ కారు షో రూంలో సరికొత్త ఫీచర్స్ తో కూడిన నెక్సా మారుతి బెలినో కొత్త మోడల్ కారును ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలతో వస్తున్న కొత్త వాహనాల గురించి వివరించారు. ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్, మైలేజ్, స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని షో రూం నిర్వాహకులు తెలిపారు. ఈ లాంచింగ్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండురంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మడుపు శివ సాయి, సీనియర్ జర్నలిస్టులు సూరమోని సత్యనారాయణ, చెరుకూరి మహేందర్, మొలుగు శ్రీనివాస్, మహేందర్ గౌడ్, హనుమంతు సుదర్శన్, సూరమోని బాబు, మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )