Logo
Date of Publish : 21 June 2026, 9:59 am
Editor : B. Anil Kumar

శంషాబాద్‌లో జీవో 111 ఉల్లంఘనలు నానాజీపూర్‌ పల్లవి స్కూల్ లో ఆగని అక్రమ నిర్మాణాలు

*శంషాబాద్‌లో జీవో 111 ఉల్లంఘనలు నానాజీపూర్‌ పల్లవి స్కూల్ లో ఆగని అక్రమ నిర్మాణాలు*  

*నోటీసులు బేఖాతర్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు స్థానికుల విజ్ఞప్తి*

విజేత,రాజేంద్రనగర్ : పర్యావరణ పరిరక్షణ కోసం అమలులో ఉన్న జీవో 111 నిబంధనలకు శంషాబాద్ మండలం నానాజీపూర్‌లో తూట్లు పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో భారీ అక్రమ భవన నిర్మాణాలు చేపడుతున్నా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. అడ్డుకునే వారు లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యం*  

నానాజీపూర్‌లో జీవో 111 పరిధిని ఉల్లంఘించి భారీ ఎత్తున పల్లవి స్కూల్ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్నప్పటికీ యజమానులు వాటిని పట్టించుకోకుండా నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

*"అధికారులకే సవాల్"*  

నోటీసులు ఇస్తే మాకేం కాదు అనే ధోరణిలో కొందరు యజమానులు వ్యవహరిస్తున్నారని, ఇది అధికారులకే సవాల్ విసిరినట్లుగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. జీవో 111 పరిధిలో అనుమతులు లేకుండా భారీ విస్తీర్ణలో G+2, అంతస్తులు నిర్మిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

*ఉన్నతాధికారులు స్పందించాలి*

ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, డీపీఓ, ఎంపీవో, రెవెన్యూ అధికారులు, గ్రామ సెక్రటరీ తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం నోటీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరుతున్నారు. అధికారులుకాస్త చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుని.. జీవో 111ను పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో హిమాయత్ సాగర్, తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )