Logo
Date of Publish : 17 November 2026, 1:13 pm
Editor : B. Anil Kumar

వైభవంగా గోపాష్టమి వేడుకలు

- సకల దేవతా స్వరూపం గోమాత, గోవులను కాపాడేందుకు సంకల్పం తీసుకుందాం.. - డా. మోహనకృష్ణ భార్గవ..

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు..

విజేత,జనగామ : గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాత ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దల్, గోసేవా - గోరక్షా విభాగ్, మాతృశక్తి సభ్యులు పాల్గొని గోమాతలను పసుపు కుంకుమ గంధము పుష్పమాలలతో అలంకరించారు. దూపదీప నైవేద్యాలతో ఆరాధించారు‌, భక్తులందరూ కలిసి మహానీరాజనం పట్టారు. భక్తులు గోమాతకు వస్త్రాలు పండ్లు గ్రాసం సమర్పించారు. అర్చకుల వేదమంత్రోచ్చరణల నడుమ గోపాష్టమి నిర్వహించారు. పరిషత్ అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి పాల్గొని గోమాతకు పూలమాలలు సమర్పించి గోమాతని కాపాడుకోవడానికి మనందరం ధర్మ రక్షకులుగా గోరక్షకులుగా మారాలని పిలుపునిచ్చారు. గో సేవ, రక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ అనేక విస్తృత కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజల్లో గోమాత యొక్క ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు ప్రకృతి సంబంధించిన భౌతిక భౌగోళిక పర్యావరణ అవసరాలను అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.

కార్యదర్శి మరియు ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా పరమాత్మ గోవును సేవించి గోమాత మహాత్మ్యాన్ని చాటిచెప్పాడని అన్నారు. బృందావనంలో ఐదేళ్ల వయసు బాలుడైన శ్రీకృష్ణుడికి నందమహారాజు గోవుల కాసే బాధ్యత అప్పగించిన రోజు కృష్ణుడు గోపాలకుడిగా, గోరక్షకుడిగా దీక్షబూనిన రోజు "గోపాష్టమి"గా జరుపుకుంటామని అన్నారు. సురభి గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో గోపాష్టమి పర్వదిన సందర్భంగా గోమాత పూజలో పాల్గొన్న భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గోమాతను ఆరాధించారు. గోమాత విశిష్టత వైభవాలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, సభ్యులు యెలసాని రాంబాబు, వివేక్ రెడ్డి, యాదగిరి, మహేందర్, నర్సింగారావ్, భజరంగ్ దల్ ఉమేష్, సనత్ కుమార్ మరియు పలువురు భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు, గోసేవకులు, మాతృశక్తి సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 3,039