దివంగత మహానేత 17వ వర్ధంతి
చొప్పదండిలో ఘన నివాళులు
విజేత,చొప్పదండి: రైతు బాంధవుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్య మంత్రి గా రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని,పేదలకు ఉచితంగా వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ,108 అంబులెన్స్ సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా చరిత్ర సృష్టించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషితో కార్యకర్తల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారన్నారు.ఈ కార్యక్రమంలో.చొప్పదండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ నిజానపురం చందు, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుర్రం సుజీత్ రెడ్డి, కౌన్సిలర్లు కొట్టే సునిత అశోక్, ముద్దం రాజేశ్వరి తిరుపతి గౌడ్,పిట్టల వెంకటేష్,వడ్లూరి అనుష శ్యామ్ సుందర్, కనుమల రాజశేఖర్,వివిధ గ్రామాల సర్పంచులు గన్ను శ్రీనివాస్ రెడ్డి,పెద్దొల్ల సురేష్, చొక్కాల తిరుపతి,లింగాల ఆనంద్,నాయకులు ఎన్నం మనోహర్,గుర్రం రమేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్,వొల్లాల కృష్ణహరి,మునిగాల సుధాకర్ గౌడ్, నెరుమట్ల మల్లేశం, మునిగాల చందు,సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.