విజేత ,వేములవాడ : శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని గౌరవనీయులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు భీమేశ్వర వసతి గృహం వద్దకు చేరుకున్న చైర్మన్‌కు పోలీసు సిబ్బంది 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో డీఈవో ప్రతాప నవీన్ కుమార్ వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీర ప్రసాద్, పీఆర్వో పెరుక శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు రాజేందర్, నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, పోలీసు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సమాచారాన్ని ఆలయ PRO పెరిక శ్రీనివాస్ అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేశారు.
