Logo
Date of Publish : 01 September 2026, 2:51 pm
Editor : B. Anil Kumar

వృద్ధురాలిపై దాడి.. మూడు తులాల బంగారం అపహరణ

కేకలు వేయడంతో పరారైన దుండగులు

విజేత, వేములవాడ: తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన వేములవాడ అర్బన్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ చింతల్‌ఠాణా గ్రామంలో మంగళవారం కలకలం రేపింది.గ్రామానికి చెందిన రోమాల మల్లవ్వ మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అనంతరం ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారని, దుండగుల దాడితో భయాందోళనకు గురైన మల్లవ్వ గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు బాధితురాలు తెలిపింది, స్థానికులు వెంటనే ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా దాడిలో మల్లవ్వ మెడకు తీవ్ర గాయాలై నోటి పళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు, ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చింతల్‌ఠాణా గ్రామానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. తెల్లవారుజామునే ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై దాడి చేసి బంగారం అపహరించడంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )