Logo
Date of Publish : 27 November 2026, 9:07 pm
Editor : B. Anil Kumar

విద్యుత్ రూపంలో మృత్యువు …కూలీ కుటుంబంలో విషాదం!

- సెంట్రింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం..

- ఇనుప సలాకా విద్యుత్ తీగలకు తగిలి కార్మికుడి దుర్మరణం

విజేత, తరిగొప్పుల/ జనగామ : రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో విద్యుత్ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ భార్యాపిల్లలను పోషిస్తున్న ఓ కార్మికుడి జీవితం ఒక్కసారిగా ముగిసిపోయింది. ఉపాధి కోసం పనికి వెళ్లిన వ్యక్తి విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక ఘటన మండలంలోని సోలిపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్‌ఐ చెన్నకేశవులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన తీగుళ్ల అశోక్ (42) రోజువారీ కూలీగా సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సోలిపురం గ్రామంలో ఓ ఇంటి స్లాబ్ సెంట్రింగ్ తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న ఇనుప సలాకా ప్రమాదవశాత్తు పైనున్న ప్రధాన విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుత్ ప్రభావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు, స్థానికులు వెంటనే అశోక్‌ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లముందే తోటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో సహచర కూలీలు దిగ్భ్రాంతికి గురయ్యారు.మృతుడు అశోక్‌కు భార్య నరసవ్వతో పాటు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న అశోక్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెన్నకేశవులు తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 3,790