విజేత, కుత్బుల్లాపూర్ : విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని కలిసిన ఏబీవీపీ సభ్యులు విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు.