Logo
Date of Publish : 15 July 2026, 11:19 am
Editor : B. Anil Kumar

విజేత’ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్* *కదిలిన యంత్రాంగం.. త్వరలో సీసీ రోడ్డు పనులు

రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తక్షణ ఆదేశాలు

విజేత' దినపత్రికకు గ్రామస్థులు వాహనదారుల ప్రత్యేక కృతజ్ఞతలు

విజేత ,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి ప్రధాన రహదారి నరకప్రాయంగా మారిందని, అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారంటూ 'విజేత' దినపత్రికలో ప్రచురితమైన "గుంతల మయం.. గుండెల్లో భయం" కథనం గట్టి ఇంపాక్ట్ చూపించింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల నిద్రమత్తు వదిలించింది. పత్రికలో వచ్చిన కథనంపై రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అత్యంత వేగంగా స్పందించారు.

​జోనల్ కమిషనర్ పిలుపు.. రంగంలోకి యంత్రాంగం

​వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గుంతల రోడ్డుపై పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకున్నారు. రహదారి అధ్వాన్న పరిస్థితిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో కాలయాపన చేయకుండా, శాశ్వత పరిష్కారంగా త్వరలోనే పూర్తి స్థాయి సీసీ (CC) రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు అధికారికంగా హామీ ఇచ్చారు.పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.*​ఆఫీసుల నుండి రోడ్ల పైకి అధికారులు*​ఏసీ రూముల్లో కూర్చునే అధికారులకు సామాన్యుల కష్టాలు పట్టవా అంటూ 'విజేత' అడిగిన సూటి ప్రశ్నకు ఫలితం దక్కింది. జోనల్ కమిషనర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు పరుగులు పెట్టారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు, నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

గ్రామస్థుల ఆనందం.. 'విజేత'కు జేజేలు

శివరాంపల్లి ప్రధాన రహదారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి మార్గం చూపిన 'విజేత' దినపత్రికకు మరియు వెంటనే స్పందించి సీసీ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చిన జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి కి శివరాంపల్లి గ్రామస్థులు, వాహనదారులు, పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 'విజేత' ఎప్పుడూ ముందే ఉంటుందని మరోసారి రుజువైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )