- నేత్రదానం తో మరొకరికి చూపునివ్వవచ్చు
విజేత,ఖమ్మం ప్రతినిధి : నగరంలోని ప్రముఖ కంటి వైద్యశాల వాసన్ ఐ కేర్ ఆధ్వర్యంలో 41వ నేత్రదాన వారోత్సవాలను (ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు) పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం విలేకరుల సమావేశం మరియు నేత్రదాన అవగాహన ర్యాలీని ఘనంగా చేపట్టింది.ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి వైద్య బృందం, మేనేజర్లు మరియు సిబ్బందితో కలిసి మేయర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొని, నేత్రదానం యొక్క విశిష్టతను, సమాజంలో దాని ఆవశ్యకతను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. మరణానంతరం చేసే నేత్రదానం ద్వారా అంధకారంలో ఉన్న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి విచ్చేసి నేత్రదాన అవగాహన ప్రచారాన్ని విజయవంతం చేసిన నగర మేయర్ గారికి వాసన్ ఐ కేర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.