Logo
Date of Publish : 31 August 2026, 6:52 pm
Editor : B. Anil Kumar

వానాకాలం పంటల డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి

–ఏఈఓ జి.వినయ్ కుమార్

విజేత,తరిగొప్పుల: మండలంలో 2026 వానాకాలం పంటల వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో పంట నమోదు చేయనున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి గుగులోతు వినయ్ కుమార్ తెలిపారు. సోమవారం రైతులకు పంటల నమోదు, డిజిటల్ క్రాప్ సర్వే విధానం గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ నాగారం క్లస్టర్ పరిధిలోని 3 రెవెన్యూ గ్రామాలలో మొత్తం 8145 సర్వే నంబర్లు ఎనేబుల్ అయ్యాయి.రెవెన్యూ గ్రామాల వారీగా కేటాయించిన సర్వే నెంబర్లు అందులో అబ్దుల్ నాగారం- 1952, బొంత గట్టు నాగారం రెవెన్యూ (బొత్తాలపర్రె, భోజ్యతండా, జాలుబాయి తండా)- 4488, నర్సాపూర్-1705 సర్వే నంబర్లు ఉన్నాయని తెలపడం జరిగింది.ఈ సర్వే నిర్వహణ కోసం రెవెన్యూ గ్రామాల వారీగా గ్రామానికి ఒకరి చొప్పున ముగ్గురిని డీసీఎస్ వాలంటీర్లను నియమించడం జరిగిందని తెలిపారు.డీసీఎస్ వాలంటీర్లు ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, వాస్తవంగా సాగులో ఉన్న పంటలను పరిశీలిస్తారని తెలిపారు. పంట పేరు, సాగు విస్తీర్ణం వంటి వివరాలతో పాటు జీపీఎస్/జియో లొకేషన్ నమోదు చేసి, పంటల ఫోటోలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు.అనంతరం సంబంధిత వ్యవసాయ అధికారులు నమోదు చేసిన వివరాలను పరిశీలించి ధృవీకరిస్తారని తెలిపారు.ఈసారి ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న రకం వరి ఆర్ఎన్ఆర్ 15048, బీపీటి 5204, కెఎన్ఏం 7715 ,1638, వీజీ ఎల్ 44, జై శ్రీరామ్, కెఎన్ఏం 7715, (హెచ్ఎంటీ) ధాన్యం సాగు చేస్తున్న రైతులు తప్పకుండా ఆన్లైన్ చేయించుకోవాలి లేని యెడల బోనస్ వర్తించదు, అలాగే పత్తి రైతులు కూడా ఆన్లైన్ చేసుకుంటేనే సీసీఐకి అమ్మడానికి వీలు ఉంటుందని తెలియజేయడం జరిగింది.డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా మండలంలోని పంటలపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ సమాచారం ఆధారంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక, పంటల కొనుగోలు, పంట నష్టం అంచనా, ప్రభుత్వ పథకాల అమలు వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు తమ రెవెన్యూ గ్రామాలకు కేటాయించిన డీసీఎస్ వాలంటీర్లకు, సంబంధిత ఏఈఓలకు పూర్తి స్థాయిలో సహకరించి, తమ పొలాల్లో సాగులో ఉన్న పంటలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ఏఈఓ తెలిపారు.

డిజిటల్ క్రాప్ సర్వే కోసం

అబ్దుల్ నాగారం గొట్టే సాంబరాజు 6302839071,

బొంతగట్టు నాగారం మ్యాకల చంద్ర శేఖర్ 9704977988,

నర్సాపూర్ అల్లిబిల్లి అనూష 6305707723 సంప్రదించవలసిందిగా తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )