Logo
Date of Publish : 01 September 2026, 1:39 pm
Editor : B. Anil Kumar

రేపు ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 420 మోసాలపై భారీ ర్యాలీ.

- ధర్నా - 420 అడుగుల బాకీ కార్డు ఫ్లెక్సీ ప్రదర్శన.

- కాంగ్రెస్ 420 మోసాలపై పోరుబాటను విజయవంతం చేద్దాం

విజేత, ఇబ్రహీంపట్నం : కాంగ్రెస్ ప్రభుత్వ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 420 అడుగుల కాంగ్రెస్ 420 బాకీ కార్డు ఫ్లెక్సీ ప్రదర్శన ర్యాలీ, అనంతరం ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) హాజరై పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని, ఆ మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన మరియు విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ అభిమానులు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందిన మరియు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు గురైన ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పిలుపునిచ్చింది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )