విజేత, చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాలలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎస్ జిఎఫ్ హ్యాండ్ బాల్ క్రీడల్లో నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అండర్-17 విభాగంలో ఇద్దరు గణేష్, వంశి , అండర్ - 14 విభాగంలో ఇద్దరు విద్యార్థులు అర్శద్, కుమార్ ఉమ్మడి జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారని వీరు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయినట్టు సిద్దిపేట జిల్లా ఎస్ జిఎఫ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి తెలిపారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఎస్ జిఎఫ్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన విద్యార్థులకు ఖేడ్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.రాములు వ్యాయామ ఉపాధ్యాయులు అజీజ్, సంతోష్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పి.డి మరియు పి.ఇ.టి లు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, హ్యాండ్ బాల్ క్రీడా అభిమానులు పాల్గొన్నారు.