విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రేమవతిపేట పరిధిలోని భవానీ కాలనీలో నివాసముంటున్న విస్లావత్ లలిత (29) అనే గృహిణి హఠాత్తుగా ఇంటి నుండి వెళ్లిపోయింది.ఆమె భర్త వి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆమె కనిపించకుండా పోయింది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత వెతికినా లలిత ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఏం జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అనే కోణంలో క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.లలిత ఆచూకీ తెలిసిన వారు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.