Logo
Date of Publish : 13 November 2026, 8:04 pm
Editor : B. Anil Kumar

మీరు ఎవరు?” అంటూ సభలోనే విలేకరిని అవమానించిన ఎంపీడీవో!

• మండల సర్వసభ్య సమావేశంలో అధికారి దర్పం.. జర్నలిస్టుకు ఘోర అవమానం

- ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే విలేకరిని కించపరిచిన వైనం

• ప్రజాస్వామ్య గొంతుకను నొక్కే ప్రయత్నమంటూ జర్నలిస్టు సంఘాల నిప్పులు

• ఎంపీడీవో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరిక

విజేత,సంగెం : ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, తన అధికార హంతో ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియాపైనే కించపరిచే వ్యాఖ్యలు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో విధి నిర్వహణలో ఉన్న విలేకరిని చూసి, "అసలు మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అంటూ ఎంపీడీవో రవీందర్ అందరి ముందే తీవ్రంగా అవమానించారు.ఉదయం సంగెం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారుల సమక్షంలో మండల సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక విలేకరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, సమావేశం జరుగుతున్న క్రమంలో విలేకరిని ఉద్దేశించి ఎంపీడీవో రవీందర్ అత్యంత దురుసుగా ప్రవర్తించారు. కనీస మర్యాద లేకుండా, ప్రజాప్రతినిధులు ఇతర అధికారుల సమక్షంలోనే "మీరు ఎవరు?" అంటూ ప్రశ్నిస్తూ విలేకరిని తీవ్రంగా కించపరిచారు. అంతటితో ఆగకుండా సమావేశం నుండి బయటకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో సభలో ఉన్న వారంతా విస్తుపోయారు.

అధికార హంకారమా . వైఫల్యాల భయమా?

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే సర్వసభ్య సమావేశానికి మీడియాను ఆహ్వానించడం, విలేకరులు హాజరవడం ఆనవాయితీ. అలాంటిది విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టును ఉద్దేశించి "మీరు ఎవరు?" అని ప్రశ్నించడం వెనుక ఎంపీడీవో అధికార దర్పం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే ఎంపీడీవో ఇలా మీడియాపై అసహనం వ్యక్తం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జర్నలిస్టు సంఘాల భగ్గుమనడం.. ఆందోళనకు పిలుపు:

విలేకరిని అవమానించిన ఎంపీడీవో తీరుపై స్థానిక జర్నలిస్టులతో పాటు జిల్లా స్థాయి మీడియా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నేతలు మాట్లాడుతూ... "ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విలేకరిని సభలో అందరి ముందే 'మీరు ఎవరు?' అని అవమానించడం అంటే యావత్ మీడియా లోకాన్ని, ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టును కించపరిచే హక్కు ఏ అధికారికి లేదు" అని మండిపడ్డారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. బహిరంగ క్షమాపణకు డిమాండ్:

విలేకరి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీవో రవీందర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 1,422