సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో వికారాబాద్ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్.
విజేత ,పరిగి : రోస్టర్ ను సవరించాలని విద్యా ఉద్యోగ అవకాశాలలో జివో 99 వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తక్షణమే రద్దు చేయాలని రాష్టర అద్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుతో వికారాబాద్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన మాలలు నిర్భందాలను చేదించుకొని సెక్రటేరియట్ ను ముట్టఢించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం పోలీసుల తోపులటలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యం కు తీవ్ర గాయం హాస్పిటల్ కు తరలింపు ఈరోజు ఉదయం నుండి గ్రూపులుగా సెక్రటేరియట్ వద్ద అరెస్టులు హైదరాబాద్ లో వివిధ పోలీస్ స్టేషన్ లకు జిల్లా నాయకులను తరలింపు సికింద్రాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర అద్యక్షునీతో పాటు జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ ను తరలింపు రేవంత్ రెడ్డి అహంకార దోరణితో తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు మాలలపై కక్ష్య సాదింపు ఎందుకు అని మండిపడ్డారు రోస్టర్ ని సవరించి మాలలకు ఇరవై లోపు రెండు పాయింట్లు కేటాయించాలి జివో నంబర్ 99 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కనీసం ఆడవాళ్ళను మహిళా పోలీసులతో అరెస్ట్ చేయలేదు ఇది దుర్మార్గం అని వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
.మాలలపై జరిగిన పోలీసుల దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలి

ఈ సందర్బంగా వికారాబాద్ జిల్లా అద్యక్షులు బి. వెంకటేష్ మాట్లాడుతూ రోస్టర్ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది జీవో 99 ని రద్దుచేసి మాల గ్రూప్ - 3 లోని 26 కులాలకు న్యాయం చేయాలని అన్నారు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాలల్ని అన్ని విధాలుగా విద్యా ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తున్నాడని అన్నారు ఈరోజు మాలలపై జరిగిన దాడి హేయమైన చర్య ప్రభుత్వం ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి రోస్టర్ విధానంలో 20 లోపు రెండు పాయింట్లు మాలలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రెటరియట్ కు వచ్చిన మాలలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి గాయపరచారు దీనిని తీవ్రంగా ఖండిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జిలతో డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన తెలుపలని పిలుపునిస్తున్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రోస్టర్ ను సవరించకపోతే ప్రభుత్వంతో మాలలు యుద్ధం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు జిల్లా నలుమూలల నుంచి సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బి. వెంకటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్కేపల్లి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు కడుమూరు రాజు తాండూర్ ఎడ్ల సురేష్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్ రాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతరాములు జిల్లా మాలమహానాడు ముఖ్య నాయకులు శ్రీను నర్సింలు విజయ్ శ్రీకాంత్ హనుమంతు రాములు యాదయ్య వినోద్ గోపాల్ శ్రీశైలం లక్ష్మణ్ విజయ్ కుమార్ శ్రీనివాస్ జిల్లా నలుమూలల నుంచి వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
