Logo
Date of Publish : 22 July 2026, 9:12 am
Editor : B. Anil Kumar

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కారు డివైడర్ ను ఢీకొని ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు

విజేత,మంత్రాలయం : మంత్రాలయం ఎన్ హెచ్ జాతీయ రహదారిపై అతివేగం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మంత్రాలయం పోలీస్ స్టేషన్ సిఐ .దస్తగిరి బాబు. తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన సుదేష్ కుమార్ రాయ్ 61, ప్రదీప్ అల్వా 62, మరియు పురుషోత్తమ కె. బందారి అనే ముగ్గురు 19/07/2026న KA 19 MP 8811 నంబర్ గల హోండా ఎలివేట్ కారులో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు.దర్శనం ముగించుకొని 21/07/2026 ఉదయం 02:00 గంటల సమయంలో తిరిగి మంగళూరుకు వెళ్తుండగా, జాతీయ రహదారిపై ఊరి బయట, వద్ద గల కల్వర్టు వద్ద కారు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మధ్యలోని డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రవిచంద్ర శెట్టి 61 S/o జనార్ధన శెట్టి, బోలూరు, మంగళూరు అక్కడికక్కడే మృతి చెందారు. ఫిర్యాదుదారు సుదేష్ కుమార్ రాయ్, కారు నడుపుతున్న ప్రదీప్ అల్వా, పురుషోత్తమ కె. బందారి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఉదయం 03:15 గంటలకు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మంత్రాలయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ఫిర్యాదుదారు సుదేష్ కుమార్ రాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రాలయం పోలీసులు Crime No: 45/2026, సెక్షన్లు 125(ఎ), 106(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )