Logo
Date of Publish : 21 September 2026, 11:03 am
Editor : B. Anil Kumar

భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అదనపు బస్సులు

- విజయవాడ, గుంటూరు సహా పలు రూట్లలో పెరిగిన సర్వీసులు

- ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం జంగయ్య పిలుపు

విజేత,భద్రాచలం, ప్రతినిధి: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే భక్తులు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి పలు ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ పి. జంగయ్య తెలిపారు. ఈ సర్వీసులన్నింటికీ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పెంచిన బస్సుల వివరాలు, వేళలు ఇలా ఉన్నాయి:

విజయవాడ మార్గం (సూపర్ లగ్జరీ):

భద్రాచలం నుంచి తెల్లవారుజామున 3:00, 4:20, 5:30 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 1:40, 2:10, 3:00 గంటలకు బయలుదేరుతాయి. అలాగే విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 7:45, 8:45, 10:00 గంటలకు, రాత్రి 7:00, 7:30, 8:00 గంటలకు బయలుదేరతాయి.

గుంటూరు మార్గం (డీలక్స్):

భద్రాచలం నుంచి ఉదయం 8:20, రాత్రి 8:00 గంటలకు బయలుదేరుతాయి. గుంటూరు నుంచి ఉదయం 8:10, సాయంత్రం 4:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.

అమలాపురం మార్గం (కుక్కునూరు, రాజమండ్రి మీదుగా) :

డీలక్స్ బస్సులు తెల్లవారుజామున 4:30, ఉదయం 10:30 గంటలకు, ఎక్స్‌ప్రెస్ సర్వీసు రాత్రి 9:00 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో అమలాపురం నుంచి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8:15 గంటలకు, డీలక్స్ సర్వీసులు సాయంత్రం 4:30, రాత్రి 9:00 గంటలకు నడుస్తాయి.

భీమవరం మార్గం (పాల్వంచ, దమ్మపేట, చింతలపూడి, ఏలూరు మీదుగా డీలక్స్):

భద్రాచలంలో ఉదయం 6:30 గంటలకు బయలుదేరి, తిరిగి భీమవరం నుంచి మధ్యాహ్నం 1:45 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.

ఏలూరు మార్గం (కొత్తగూడెం, సత్తుపల్లి, చింతలపూడి మీదుగా డీలక్స్):

భద్రాచలం నుంచి మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు ఏలూరు నుంచి భద్రాచలానికి తిరుగు ప్రయాణమవుతుంది.భద్రాచలం, పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఈ పెంచిన బస్సు సర్వీసులను, రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని డీఎం కోరారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )