ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ అందజేసిన సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
విజేత ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ అందడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి యూనిఫామ్స్ పంపిణీ చేసిన సర్పంచ్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి, ఉపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.