Logo
Date of Publish : 17 October 2026, 8:16 am
Editor : B. Anil Kumar

బతుకమ్మ చౌక్ లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

విజేత,పాపన్నపేట : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణం శ్రీ నల్లపోచమ్మ కాలనీ బతుకమ్మ చౌక్ ప్రధాన చౌరస్తాలో అట్ల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ మహాసంబరాలు కన్నులపండువగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఉత్సాహభరితమైన ఆటపాటలు, ఉయ్యాల పాటలు, కోలాటాలతో చౌరస్తా పూలవనాన్ని తలపించింది.

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతికి అద్దం పట్టేలా ఈ వేడుకలు సాగాయి. కాలనీ మహిళలు తరలివచ్చి, తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రాంగణమంతా పండుగ శోభను నింపాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు, చిన్నారులు ఉత్సాహభరితంగా బతుకమ్మ ఆటలు ఆడారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )